మల్కాజిగిరి
23 నవంబర్
అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలంటే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని,మరి రాజశేఖర్ రెడ్డి సతీమణి మర్రి మమతారెడ్డి అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని,గౌతమ్ నగర్,ఈస్ట్ ఇందిరా నెహ్రు నగర్,దయానందనగర్ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు బైరు అనిల్, హనుమంతరావు మరియు చిట్టిబాబు మరియు అనిత తదితరులు పాల్గొన్నారు.