
కుందారం సర్పంచ్ సమ్మయ్య
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో స్థానిక సర్పంచ్ సమ్మయ్య ఆధ్వర్యంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి ప్రచారాన్ని చేపడుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.గతంలో కొన్ని పార్టీలు అధికారంలో ఉన్న చెన్నూరు ను ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. చెన్నూరులో బాల్క సుమన్ చేసిన అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలని ప్రతి ఊరికి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని వారిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రతి ఒక్కరు ఓటు వేసి అభివృద్ధి దిశగా నడిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని ప్రజలకు వివరించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలను చూస్తే మళ్లీ మూడవసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ నే వస్తదని అన్నారు.ప్రతి ఊరిలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ బాల్క సుమన్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.