చెన్నూరులో భారీ మెజారిటీతో బాల్క సుమన్ ని గెలిపించండి
చెన్నూరు అభివృద్ధి బాల్క సుమన్ లక్ష్యం
#బీఆర్ఎస్ పార్టీ నాయకులు#
జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండల్ నర్వ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం రోజున గడపగడపకు ప్రచారాన్ని చేపడుతూ కారు గుర్తుకు ఓటు వేసి బాల్క సుమన్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఓటు ఎలా వేయాలో ప్రజలకు వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు తెలియజేశారు. చెన్నూరులో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ని మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి దిశగా పయనం జరుగుతుందని తను చేసిన అభివృద్ధిని చూసి భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి బాల్క సుమన్ ని గెలిపించాలని కోరారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన కొత్త మేనిఫెస్టోను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజుకుమార్, వార్డ్ మెంబర్లు వెంకటేష్ ,నారాయణ, గోదరి బాలకృష్ణ, గద్దల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
