
కాటారం నేటి ధాత్రి
-రూ.50లక్షల నిధులతో కమ్యూనిటీ హల్ నిర్మాణానికి సహకరిస్తా..
-అభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి…
-మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్
కాటారం
మున్నూరు కాపు కులస్థుల సంక్షేమం కోసం కృషి చేస్తానని బిఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ అన్నారు. కాటారం మండలంలో మున్నూరు కాపు యువత మండల అధ్యక్షులు తోట కోటేశ్వర్, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు దబ్బేట రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు కులస్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి పుట్ట మధుకర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కులసంఘ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కోసం కాటారం మండలం మండలం గారెపల్లి గ్రామానికి చెందిన చీమల రాజయ్య పటేల్ , చీమల వెంకటస్వామి పటేల్ లు వారి తండ్రి చీమల పోచయ్య పటేల్ జ్ఞాపకార్థం కాటారం మండలకేంద్రంలో 15గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. కాగా మున్నూరు కాపు కుల సంఘ నాయకులు చీమల రాజయ్యకు సమ్మేళనం కార్యక్రమం వేదిక వద్ద శాలువతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బిఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్