
బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బోయినిపల్లి గ్రామంలో గడపగడప బి ఆర్ ఎస్ నేతల ప్రచారం నిర్వహించారు గడపగడపకు పర్యటిస్తూ బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు భీమనాథుని రమేష్, గుంటి శంకర్, నల్లగొండ అనిల్ కుమార్, కన్నం సాగర్, బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.