బీ ఆర్ ఎస్ కే ప్రజల అండా దండా
జైపూర్,నేటి ధాత్రి:
చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ కి బతుకమ్మలు, మంగళ హారతులు, బోనాలతో ఘన స్వాగతం పలికిన జైపూర్ మండల్ ముదిగుంట గ్రామస్తులు, ప్రచారంలో భాగంగా బాల్క సుమన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పల్లెలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయబడుతూ అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం జరిగింది. ఏ గ్రామంలో చూసిన హనుమంతుడు లేని ఊరు అంటూ లేదు సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టి లబ్ది పొందని గ్రామాలు లేవు, అలాగే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ముందుకు పోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మళ్లీ మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను దీవించి గెలుపొందించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలకు మోసపోకుండా వాస్తవాలను గమనించి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను. 50. ఏళ్లుగా లేని అభివృద్ధి పనులను 10. సంవత్సరాలలో చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి యువతి, యువకులు మంచి ఆలోచన చేసి అభివృద్ధి చేసిన నాయకుల్ని గెలిపించగలరని కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోదారి రమాదేవి, సర్పంచ్ దుగుట జ్యోతి మండల నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.