
ఓటువేసే విధానం ప్రజలకు అవగాహన కల్పించుట
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ బ్యాలెట్ బాక్స్ ఓటు వేసే విధానాన్ని గ్రామ ఉపసర్పంచ్ సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రైతుకు రైతు బంధు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది.ఎవరు అడగలేకపోయిన వృద్దులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్ ఇస్తున్నాం.కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పథకాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య భీమా ద్వారా 15లక్షల వరకు ఆరోగ్య భీమా కలిస్తుంది 1200 ఉన్న గ్యాస్ ధరలను తగ్గించి కేవలం 400లకే గ్యాస్ అందిస్తుంది.సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల 3000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
3016 ఉన్న ఆసరా పెన్షన్ ప్రతి ఏటా 500 పెంచుతూ 5016వరకుఅందిస్తుంది,4016ఉన్న వికలాంగుల పెన్షన్ 6016 అందిస్తుంది.ఎన్నికలు రాగానే నాయకులు వస్తుంటారు ఒక్కసారి ప్రజలు వారిని అడగాలి.ఈ ప్రచార కార్యక్రమంలో మారేపల్లి నందం, కుసుమ శరత్, లక్ష్మారెడ్డి, మారేపల్లి మోహన్ ప్రభాకర్ ,కరుణబాబు,
తదితరులునాయకులు, పాల్గొన్నారు.