పరకాల నేటిధాత్రి
పరకాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుటకు మరొకసారి అవకాశం ఇవ్వాలని బి.ఆర్.ఎస్.అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.సోమవారం ఉదయం పరకాల పట్టణం 10,11 వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్,బిజెపి పార్టీల నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.చేరికయిన వారిలో బుస్స మొగిలి,గూడెల్లి దశరతం,పసుల రాజ భద్రయ్య,మంద రవిలు మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి,సంక్షేమ పథకాలు నచ్చి బారస పార్టీలోకి చేరిక కావడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు రేవూరి విజయపాల్ రెడ్డి,దుప్పటి సాంబశివుడు,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.