ఇందారంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలి

వాట్సాప్ గ్రూపులో ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకుంటే ఐటియాక్ట్ కింద కేసు నమోదు అవుతాయి

సిఐ రమేష్ బాబు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ ఇందారం గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు పై అవగాహన కల్పించేందుకు సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో జైపూర్, భీమారం, శ్రీరాంపూర్, పోలీసుల సిబ్బందితో పాటు ఎన్ సి సి విద్యార్థులు ఫ్లాగ్ మార్చ్ ని నిర్వహించారు. ఇందారం బస్టాండ్ సమీపంలో నుండి మజీద్ చౌరస్తా టేకుమట్ల రోడ్డు దొరగారి పల్లె బోయవాడ హై స్కూల్ వరకు ఫ్లాగ్ మార్చిని నిర్వహించి రాబోయే 30 తారీఖు రోజున అందరూ ఓటును వినియోగించుకోవాలని సిఐ అన్నారు. ప్రలోభాలకు ప్రజలు గురికాకుండా ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎవరికి భయపడకుండా నిర్భయంగా ఓటు వేయడాన్నే ఫ్లాగ్ మార్చ్ అని అంటారని తెలియజేశారు. ఈ ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాది ఈ పార్టీ నాది అని గొడవలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. దూర ప్రాంతాలలో ఉండేవారు ఎన్నికల సమయానికి తన సొంత ఊరికి వచ్చి ఓటును వినియోగించుకోవాలని అన్నారు వాట్సప్ గ్రూప్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే ఐటియాక్ట్ కింద కేసు నమోదు అవుతాయి. ప్రైవేటు ఉద్యోగులు కూడా భవిష్యత్తులో ఇబ్బంది గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్ బాబు,జైపూర్ ఎస్సై ఉపేందర్ రావు,శ్రీరాంపూర్ ఎస్సై రాజేష్, భీమరం ఎస్సై రాజవర్ధన్, పోలీసుల సిబ్బంది ఎన్సిసి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!