పిల్లలే మన జాతి భవిష్యత్తు మూలస్తంభాలు

నేటి ‌బాలలే రేపటి భావిభారత పౌరులు
దేశానికి మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ సేవలు అద్వితీయం

నేటిదాత్రి భద్రాచలం

జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డు ఆనంద్, జోసెఫ్
జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి కమిటీ ఆధ్వర్యంలో
ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు
నెహ్రూ చిత్రపటానికి పూలమాల‌ వేసి నివాళ్లర్పించిన కమిటీ సభ్యులు

భద్రాచలం :

నేటి ‌బాలలే రేపటి భావిభారత పౌరులని, పిల్లలే మన జాతి భవిష్యత్తు మూలస్తంభాలని, దేశానికి మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ సేవలు అద్వితీయమని, ఆయన కృషిని భవిష్యత్తు తరాలకు అందించాలని జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డు ఆనంద్, జోసెఫ్ కుమార్ అన్నారు. జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు కమిటీ లీగల్ అడ్వైజర్, ప్రముఖ హైకోర్టు న్యాయవాది మల్లెల సత్యనారాయణ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి జర్నలిస్టు ఫోరం ఆఫ్ భద్రాద్రి కమిటీ సభ్యులు పూలమాల‌ వేసి నివాళ్లర్పించారు. అనంతరం జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డు ఆనంద్, జోసెఫ్ మాట్లాడుతూ.. బాలల హక్కులు, విద్య, పిల్లల సంక్షేమం గురించి అవగాహన పెంచడానికి భారతదేశం అంతటా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 న భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజున జరుపుకుంటారన్నారు. అతను పిల్లలను ఇష్టపడేవాడని, ఈ రోజున, భారతదేశం అంతటా పిల్లల కోసం అనేక విద్య, ప్రేరణ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. భారతదేశంలో, 1948 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, దీనిని ఫ్లవర్ డే అని కూడా పిలుస్తారని తెలిపారు.  భారతదేశం మొదటి ప్రధాన మంత్రి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, పిల్లలను కూడా చాలా ఇష్టపడే వారి జ్ఞాపకార్థం, అతని పుట్టినరోజును చాలా ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకుంటారని పేర్కొన్నారు. మన దేశంలో బాలల హక్కులు, స్వేచ్ఛ, విద్యను పరిరక్షించడానికి, బాలల దినోత్సవాన్ని జరుపుకునే ప్రక్రియ ప్రారంభించారన్నారు. సమాజ అభివృద్ధిలో పిల్లల ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన కల్పించాలని కోరారు. మొదట్లో బాలల దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహించే ధరల పంపిణీ వేడుకలు, కార్యక్రమాలకే పరిమితమయ్యాయని. కానీ ఇప్పుడు, సమాజంలో ప్రబలంగా ఉన్న పిల్లల నేరాలు, అన్యాయాల గురించి అవగాహన కల్పించడానికి పాఠశాలలు, సంఘాలు, ఇతర క్లబ్‌ల ద్వారా భారీ వేడుకలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. పిల్లలే మన జాతికి భవిష్యత్తు మూలస్తంభాలన్నారు.  విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపడానికి పాఠశాలలు అత్యంత బాధ్యత వహిస్తాయని, అందువల్ల బాలల దినోత్సవాన్ని అత్యంత ప్రాముఖ్యత, పరిపూర్ణతతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాడి వెంకటేశ్వరరావు, అనిల్ రామాచారి సాయిబాబా, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!