రాబోయేది అధికారం బిఅర్ఎస్ పార్టీదే..
ప్రధాని మోడీ రాష్ట్రంలో 24 గం.కరెంటు లేదు.
కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
రాష్ట్రంలో పెద్ద ప్రమాదం రాబోతున్నది.
గంగానది ఉన్న యూపీ రాష్ట్రంలో నీటి సరఫరా ఏమైంది.
రాహుల్ గాంధీకి ఎద్దు ఎవసం తెలవదు.
ధరణి పోర్టల్ రైతులకే అవకాశం ఇచ్చింది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు..
నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్..
నర్సంపేట, నేటిధాత్రి :
బిఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం అని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలందరికీ తెలుసు అని ఆనాడు ఉన్న తెలంగాణను ఊడా కొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణను కరువు గురి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన విమర్శించారు. కృష్ణ గోదావరి నదులు తెలంగాణ రాష్ట్రాన్ని అంచుకొని పారుతూ పోతున్న కృష్ణా, గోదావరి నదుల మంచినీళ్లను, సాగునీల్లకు, బుక్కెడు మన్సినీళ్ళవని పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని సీఎం కేసీఆర్ అడిగారు. తెలంగాణ రాకముందు కరెంట్ లేదు సాగునీరు లేదు మంచినీళ్లు లేవు రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆకలి చావులు చాలా భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నవవి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలతో ప్రజా ఆశీర్వాద సభలో వివరించారు . నర్సంపేట పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోరుతూ చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. నర్సంపేట నియోజకవర్గం లోని ఆయా మండలాల పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిమంది ప్రజలు తరలి వచ్చారు . తెలంగాణ ఉద్యమకారుడు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవకుడిగా పనిచేస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఆశీర్వాద సభకు జన సందోహం ముఖ్యమంత్రి కెసిఆర్ కు అబ్బురపరిచింది. సోమవారం చేపట్టిన ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే పని చేస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు . గతంలో ఉన్న ప్రభుత్వ ఆలయంలో ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు ఎట్లా ఉండేదని ప్రజలు ఆలోచన చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులకు 10 హెచ్పి మోటార్లతో మూడు గంటల కరెంటు సరిపోతుందని తెలుపుతుండగా మరోవైపు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి రైతు బంధు పథకం వృదానే అని అనుతున్నారని ఆరోపించారు. ఎద్దు ఏవసం తెలువని రాహుల్ గాంధీ, సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ధరణిని బంగాళాఖాతంలో వేస్తాననడం ఎంతవరకు సమంజసం అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ లో రైతులకే అధికారం ఇచ్చిందని తెలిపారు. ఆ ధరణి హోటల్ ద్వారానే నేడు రైతుబంధు పథకం ద్వారా నేరుగా రైతు ఖాతాలో బ్యాంకుల ద్వారా పెట్టుబడి సహాయం అందుతుందని తెలిపారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు పెట్టుబడి కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు వివరించారు. 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత దేశంలో తెలంగాణకే దక్కిందని తెలుపుతూ ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు సాధ్యం కాలేదని పేర్కొన్నారు.
ధరణి పోర్టల్, 24 గంటల ఉచిత విద్యుత్తు పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తే వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రజలకు తెలియజేశారు. విద్యుత్ పట్ల అలాగే రైతు సంక్షేమ పథకాల పట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కుల్ల కుల్లంగా చెబుతున్నది అందుకు ప్రజలు ఆలోచించి వ్యవహరించాలని కోరారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రంలో పెద్ద ప్రమాదం రాబోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ద్వారా వారి సాగునీటికి ఎలాంటి టాక్సీలు లేవని నీటి తీరువ బకాయి రద్దు చేసినట్లు తెలిపారు.. గంగా నది పరివారం ఉన్న ఉత్తర ప్రదేశ్ చెందిన కొందరు లుంగీలు కట్టుకొని రాష్ట్రానికి వస్తారని వారికి సాధ్యం కానీ మంచినీటి సమస్యను మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీరు అందించాలని సీఎం పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గం లో 60 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గోదావరి పాకాలను పూర్తి చేసిన ప్రాంత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికే సాధ్యమైందని సీఎం తెలిపారు. జిల్లా కేంద్రానికి రావాల్సిన ప్రభుత్వ మెడికల్ కళాశాల నర్సంపేటకు మంజూరు కావడం పెద్ది చేసిన కృషి నిదర్శనమని సీఎం వివరించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలు గ్రహించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిచి అధికారాన్ని చేపట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం స్థానికంగా ఉంటూ ప్రజాసేవకే అంకితమయ్యానని తెలిపారు. నేను కాంట్రాక్టర్ ని కాదు దందాలు చేయను అని తెలుపుతూ నాకు నా ప్రజలే ధైర్యం మీరే నాకు దిక్కు అంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ మంత్రి రాథోడ్ ఎంపీ మాలతి కవిత, ఎమ్మెల్సీ మధుసూదన చారి, వరంగల్ ఎంపీ దయాకర్, ఎన్నికల ఇన్చార్జి డాక్టర్ ప్రకాష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని కిషన్, ఎన్ఆర్ఐ అధికార. ప్రతినిధి రాజ్ కుమార్, పాల్గొన్నారు.