పరకాల నేటిధాత్రి
తెలంగాణ ఆత్మగౌరవానికి అసలైన ప్రతీక బిఆర్‌ఎస్సేనని తెలంగాణ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పరకాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.పరకాల నియోజకవర్గానికి పార్టీలో చేరినవారు:
కందుకూరి నరేష్,కొంగర ప్రభాకర్,గొనె మధుకర్,సిద్దోజు రాజమౌళి,పెండ్లా రమణ,నల్ల రవి,ఆంజనేయులు,సుంకరి దిలీప్,చిదురాల రామన్న,తాటి సాంబశివరావు,కేదాసి స్వామి,కృష్ణ పాల్,సాంబరెడ్డి,సంపత్ రెడ్డి,పెంచాలా రాజ,మహారాజ్ బేగం,నీలం పరశురాములు
చెందిన టీడీపీ క్యాడర్ మొత్తం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో హనుమకొండలోని వారి నివాసంలో గులాబీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ పూర్తిగా ఖాళీ అయిందన్నారు.ఇటీవల టీడీపీ నుంచి పరకాలలో తిరిగిన వ్యక్తి టీడీపీ క్యాడర్ ను మోసం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మోచేతినీళ్ళు తాగుతున్నారని మండిపడ్డారు.పార్టీని నమ్మి వచ్చిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు.గెలుపు కోసం కాకుండా మెజార్టీ కోసం గ్రామా గ్రామానా పార్టీ ప్రవేశపెట్టే మ్యానిఫెస్టోను వివరించాలన్నారు.కాంగ్రెస్,బిజెపి నాయకుల మాటలను తిప్పికొట్టాలన్నారు.ఇతర పార్టీ నాయకులు గ్రామాలల్లో చేస్తున్న తప్పుడు ప్రచారాలను తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
చల్లా ధర్మారెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్న టీడీపీ క్యాడర్
