ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,
ధర్మపురి నియోజక వర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి లో భారాస పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ , గెలుపునకు మద్దతుగా ఈ రోజు చెర్లపల్లి, గ్రామంలో భారాస పార్టీ రాష్ట్ర ఎన్అర్ఐ యువ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి పర్యటించి యువకులతో సమావేశమై కేసీఆర్ సర్కార్ లో యువత భవిష్యత్తుకు చేపట్టిన పథకాలను వివరిస్తూ ఈ పథకాలు కోనసాగాలాంటే యువత అంత చైతన్యవంతులై కేసీఆర్ కీ అండగా నిలవాలని ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడుగుడున ఎండగట్టాలని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మన అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారాస మండల అధ్యక్షుడు సింహాచలం జగన్, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు, సోషల్ మీడియా కన్వీనర్ మహ్మద్ రియాజ్, యూత్ కన్వీనర్ రామగిరి మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు శేరే శ్రావణ్, గ్రామ కో-ఆర్డినేటర్ బట్టు రామస్వామి, ఉప సర్పంచ్ అల్గం తిరుపతి, ఉద్యమ సీనియర్ నాయకులు పడిదం వెంకటేష్, సిగిరి ఆనంద్, పడిదం నారాయణ, పడిదం మొగిలి, అదే శంకర్ నాయకులు అజార్, శేరే సత్తయ్య, ఆగండ్ల రవి, మాదాసు గంగాధర్, జలపతి, శేరే మహేష్, బండి తిరుపతి, ఆరెల్లి నరేష్, సిగిరి మహేష్, జుంజిపెల్లి నరేష్, చుంచు అనిల్, పాస్టర్ క్యాతం యోనా మరియు జై భీమ్ యూత్ సభ్యులు, సోషల్ మీడియా వారియార్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.