జనగామ నియోజకవర్గం లో బి ఆర్ఎస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంలో ముందంజ

వివిధ పార్టీల నుండి భారీగా బిఆర్ఎస్ లో చేరికలు

అందర్నీ కలుపుకొని పోతున్న పల్ల రాజేశ్వర్ రెడ్డి

18న చేర్యాలలో కేసీఆర్ బహిరంగ సభ

చేర్యాల తో కేసిఆర్ కు ప్రత్యేక అనుబంధం

జనగామ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ కంచుకోట

జనగామ అసెంబ్లీ నియోజకవర్గం సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు మెజార్టీ సీట్లు బిఆర్ఎస్

కెసిఆర్ ఇచ్చిన పథకాల దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు

జనగామ బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి

కొమురవెల్లి నేటిధాత్రి

కొమురవెల్లి మద్దూరు చేర్యాల నర్మేట దుల్మిట్ట మండలం లో పలు గ్రామాలలో జనగామ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి దూసుకుపోతు ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజలలో గ్రామాల్లో మంచి స్పందన వస్తుంది ఈ సందర్భంగా కెసిఆర్ ఇచ్చిన హామీలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరిస్తూ మరియు తను చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహనతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో..గృహలక్ష్మి, ఆసరా పింఛన్లు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్ల కోసం నిధులు తెచ్చి బ్రహ్మండగా అభివృద్ది చేస్తా అని. భరోసా ఇస్తూ బరాబరి ఓట్లు వేసి, ఏమైనా పనులు కావాలంటే కూడా మాతో కొట్లాడి పనులు తెచ్చే నాయకులు కూడా మీ గ్రామాలలో ఉన్నరు. అని చెబుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనంలో ముందంజలో ఉన్నారు , తనదైన ప్రసంగంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూచేర్యాల, మద్దూరు నర్మెట కొమురవెళ్లి మండలాలు మీ సిద్దిపేట పక్కనే ఉన్నాయి..ఇక్కడ నుంచి రాకపోకలన్నీ సిద్దిపేటకు గజ్వేల్ కు ఉంటయి కదా. వాళ్లకు కావాల్సిన పనులు చూడాలె సార్ అని చెప్పగానే మొన్ననే రూ.60 కోట్లు ఇచ్చిండు.చేర్యాలకు 10 కోట్లు, జనగామకు రూ. 20 కోట్లు.. మిగిలినవి గ్రామాల అభివృద్దికి ఇచ్చిన..పీహెచ్ సీ కావాలని ఇక్కడి ప్రజలు అడిగారు.పల్లె దవాఖాన కింద మనం మంజూరు చేయవచ్చు. ఆలయాల అభివృద్దికి కూడా కృషి చేస్తా. అని చెబుతూ కొమురవెల్లి మండలం లో కిష్టంపేట గ్రామం ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే ఉన్నారు. ఇప్పుడు కూడా బీఆర్ ఎస్ వెంటే ఉంటదని మిమ్మల్ని చూస్తున్నారు. నేను ఊళ్లో అడుగు పెట్టగానే మీరేం చెప్పొద్దు సార్… కారు గుర్తుకే ఓట్లేస్తామని ముందుగానే చెప్పడం సంతోషమనిపించింది. అన్నారు జనగామ బిఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆసరా పింఛన్లతో వృద్దులకు ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. అని కొడుకులు, కోడల్లు, మనువలు, మనవరాళ్ల ఏమైనా అవసరం ఉంటే వాళ్లే డబ్బులు ఇస్తున్నారు.18 ఏళ్లు నిండిన వారందరికీ సౌభాగ్య లక్ష్మి కింది రూ. 3000 పింఛన్లు ఇస్తున్నారు.వచ్చే నెల నుంచి రూ. 400 కే గ్యాస్ బండ వస్తంది. అని ఇలా పింఛన్, గ్యాస్ , సన్నబియ్యం అన్నీ సీఎం కేసీఆర్ సారే ఇస్తున్నారు అన్నారు .సమాజంలో అందరూ బాగుండాలి. ఊళ్లో ఒక్కరిద్దరు బాగా లేకపోతే మనకు బాగనిపించదు.. ఇయ్యాల ఇక్కడున్న దళితులు, అన్నదాతలు, పేద ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అన్నారు రాజేశ్వర్ రెడ్డి గారు చెబుతూ వ్యవసాయకూలీలు, ఇతర పురుగులు, విత్తనాల ధరలు , కోత మిషన్ తదితర ఖర్చులన్నీ పెరిగినయ్ . దీంతో రైతు బంధు కింద ఇచ్చే రూ.10 వేలు సరిపోవడం లేదని, వాటిని రూ 16 వేలు ఇవ్వనున్నారు. రైతు బీమా కింద ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నారు. దానిని భూమి జాగ లేకున్నా, కౌలు రైతులకు ఇలా గ్రామంలోని అందరికీ కేసీఆర్ బీమా కింది రూ. 5 లక్షలు ఇవ్వనున్నారు. పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ- ఇక చేర్యాల రెవెన్యూ డివిజన్ విషయాన్ని మొన్న జనగామ మీటింగ్ లో కేసీఆర్ సార్ ఇస్తానని స్పష్టం చేసిండు. అని మీ అందరి తరఫున సార్ కు ధన్యవాదాలు చెబుతున్న. అన్నారు చేర్యాల గడ్డపై ఉన్న మమకారంతో ముఖ్యమంత్రి ఈ నెల 18న చేర్యాలకు వస్తున్నడు. రెవెన్యూ డివిజన్ విషయాన్ని సార్ కు మళ్లోసారి గుర్తు చేద్దాం. అన్నారు మనం పథకాలు ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేస్తుంటే ఈ పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ వాళ్లు..పథకాలను కేసీఆర్ అర్రాస్ పెడుతున్నడు అంటున్నరని ఆరోపణ లు చేయడం సిగ్గు చేటు. అన్నారు ఇంకా పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అన్ని అవకాశాలు, గౌరవం ఇచ్చింది. ఆయన వ్యాపారం కోసం అన్ని పార్టీలు మారిండు. ఆయన మొదట బిఆర్ఎస్ వైసీపీ, బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఆయన పార్టీలు మారుతూనే ఉన్నడు నాది తరిగొప్పుల పక్కన ఉన్న సోడషపల్లి జనగామ జిల్లా..నీది చేర్యాల కావొచ్చు. ఇద్దరిదీ ఒకే ప్రాంతం.. అతడు నన్ను లోకల్ కాదంటడు. అదెట్ల. నువ్వు అభివృద్దిలో పోటీ పడాలని హితవు చెప్పారు ఆయన ఊసరవెళ్లిలో పార్టీలు మారుతున్న అతడా ఇలాంటి మాటలు. మాట్లాడేదా.l అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ-ఘట్ కేసర్ దగ్గర 300 బెడ్లతో నీలిమా హస్పిటల్ పెట్టిన..ఎవరికైనా ఏమైనా కావాలంటే రేషన్ కార్డు తీసుకెళ్తే అక్కడ సేవలన్నీ ఉచితంగా చేయించే బాధ్యత నాదే. అని భరోసా ఇచ్చారు నేను ఉద్యమ కారుడినే..పోరాటాల్లో భాగంగా జైలుకు వెళ్లిన ..నాకు జనగామ రవీందర్ రెడ్డే అనే లాయర్ బెయిల్ కూడా ఇప్పించిండు.కేసీఆర్ కు చేర్యాలమీద ప్రేమ, నాపై ప్రేమ. మీరంతా కష్టపడి కారు గుర్తుకే ఓటేసి గెలిపించండి. అని మూడోసారి సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేద్దాం-అన్నారు మీరంతా కారు గుర్తుకే ఓటేసి మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని గెలిపించుకుందామని అన్నారు గ్రామ గ్రామాలలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం చాలా హుషారుగా ప్రచారం సాగుతోంది కొమురవెల్లి ప్రతినిధి
కాసుల కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *