ఇంటింటి ప్రచారం నిర్వహించిన మైనార్టీ నాయకులు కరీం

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మైనారిటీ సంక్షేమ పథకాల గురించి రాష్ట్ర మొత్తం తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తున్న మైనారిటీ రాష్ట్ర సినీ సీనియర్ నాయకుల బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైనారిటీ నాయకులను కలవడం జరిగింది ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గురించి రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడడం ద్వారా ఎటువంటి లాభాలు పొందుతామని గెలుపు యొక్క అవశ్యకత గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మైనారిటీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాట్లాడుతూ గంగా జమున తహజీబ్ సంస్కృతియే బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక లక్షణం అని కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరినీ కూడా సంక్షేమం అభివృద్ధి వైపు బాటలు వేయడమే బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన లక్ష్యం అని కరెంటు కోతలు లేని బుల్డోజర్ విధానాలు లేనటువంటి ప్రజా సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీని మరొకసారి గెలిపించుకోవాలని భావితరాలకు సువర్ణ రాష్ట్రంగా పాడిపంటలతో కళకళలాడే రాష్ట్రంగా తీర్చి దిద్దుకునేటువంటి బాధ్యత మైనారిటీ సోదరులందరి పైన ఉందని తమ అమూల్యమైన ఓటును బిఆర్ఎస్ పార్టీకి వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేయడం అయింది మరియు బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ముస్లిం జీవితాల్లో వెలుగు నింపుకుందామని గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా ముస్లిం సమాజానికి జరిగిన అభివృద్ధి గురించి ఈ ఎన్నికల్లో గెలిస్తే జరగబోయేటువంటి అభివృద్ధి గురించి కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి గత ప్రభుత్వాలు 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం వివిధ పథకాలను 12 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది తల్లి గర్భం నుండి బిడ్డను ప్రసవించిన దగ్గర నుండి వృద్ధాప్య దిశలోఉన్న ప్రతిమనిషి వరకు ఏదో పథకం ద్వారా కులమత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించినటువంటి దేశంలోనే ఏకైక ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలియజేయడమైనది భూపాలపల్లి నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని గెలిపించుకోవడంలో జిల్లా మైనారిటీ నాయకులందరూ శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీసీనియర్ నాయకులు ముజీబ్ ,షాహినాలి ,కాసిం సర్వర్ పాషా ,ఆఫీస్ ,తల్హా సోహెల్, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మైనారిటీ డిస్టిక్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం ,ముస్లిం సేవా సమితి ప్రెసిడెంట్, ఎస్ కే సాదిక్ పాషా, ఇమ్రాన్, సుభా నుద్దీన్, సాదిక్, చాంద్ పాషా, అబ్దుల్ అజీమ్, ఇలియాస్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!