
అధిక మెజారిటీతో గెలిపించాలి-కౌన్సిలర్ సంపత్
ఆపదలో వెంటుండే నాయకుడు ధర్మన్న-సాంబరాజు జ్యోతి
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో 55వ బూత్ లో చల్లా ధర్మారెడ్డి గెలుపు పై బి ఆర్ ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు చల్లా ధర్మారెడ్డి ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ఇచ్చిన హామీల కరపత్రాలతో గడపగడపకు ప్రచారం చేయడం జరుగుతుందని అలాగే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని పక్క రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నుంచి ఐదు గంటల కరెంటు ఇస్తుంటే మన రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారనిమన ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఎన్నోఅభివృద్ధి పనులు చేశారనిచేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసునని అందుకే వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేశారు.