ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉండే… ఈనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి

*తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది

కొండరావుపేట, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి తెలంగాణ ప్రాంతం ఎట్లుండే, ప్రత్యేక పాలనలో ఇప్పుడు ఎట్లుంది అనే విషయాన్ని ప్రజలు గమనించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డిలతో కలిసి కోనరావుపేట మండలంలోని రామన్నపేట, కొలనూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మన పరిస్థితులు ఎట్లా ఉండే, నేటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ప్రజలు గమనించాలని, ఆనాడు వలసలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తెలంగాణ నేడు బీహార్, ఛతీస్ ఘడ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కార్మికులు, కూలీలు, వలసలకు వచ్చే స్థితికి చేరిందని, ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ కృషి, బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వ ఘనత అని అన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో విదేశీ పెట్టుబడులతో స్థానిక యువతకు ఇక్కడే పుష్కలంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఇది కేవలం తమ నాయకుడు కేసీఆర్ కృషి ఫలితమేనని అన్నారు. అందుకే సంక్షేమ ఫలాలు సక్రమంగా అందాలన్నా, మన బ్రతుకులు మరాలన్నా మళ్ళీ ఒకసారి బి.ఆర్.ఎస్ పార్టీకే అధికారం ఇవ్వాలని అన్నారు. కొలనూర్ తో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని, తన గ్రామం మల్కపేటకు వెళ్లాలంటే కొలనూర్ మీదుగానే వెళ్లాలని, ఈ ప్రాంత బిడ్డగా ముందుకు వస్తున్న తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ప్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సర్పంచులు తుమ్మల యమునా-మహేష్, కాదాసు సంతోష్, ఎంపిటిసి ఎర్ర మల్లేశం, గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్, నర్సయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు ముష్ణం జీవన్ గౌడ్, నాయకులు రమణ రెడ్డి, శ్రీనివాస్, మాసం సుమన్ లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!