16వ వార్డులో ఇంటింటికి పథకాలను వివరిస్తున్న బి ఆర్ ఎస్ నాయకులు

ప్రచారంలో పాల్గొన్న మాజీ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి,ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గం పరిధిలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని పరకాల పట్టణంలోని 16వ వార్డు కౌన్సిలర్ బండి రమాదేవి సారంగపాణి,కుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో భాగంగా బండి రమాదేవి సారంగపాణి మాట్లాడుతూ మన పరకాల అభివృద్ధి ప్రదాత చల్లా ధర్మారెడ్డి నేతృత్వంలో వంద పడకల ఆసుపత్రి మరియు సెంట్రల్ లైటింగ్ పరకాలలో ప్రధాన రహదారులు మరియు 22 వార్డుల్లో గల్లి గల్లి నా సిసి రోడ్లు నూతన ఎంపీడీవో ఆఫీసు మరియు ఎమ్మార్వో ఆఫీస్ భవనము ఏర్పాటు మినీ ట్యాంక్ బండ్ఏర్పాటుకుకృషి.ఒక పరకాలలోనే గాక నియోజకవర్గం మొత్తంలో చల్లా ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం తెలంగాణలో పరకాల నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరికి అందిస్తూ లబ్ధి పొందుతున్నారని తెలిపారు. దళిత బంధు,బీసీ బందు,రైతుబంధు,కేజీ టు పీజీ ,ఉచితవిద్య, వైద్యము,కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్,ఉచిత కరెంటు, కాలేశ్వరం నీటిని ఇంటింటికి సరఫరా చేస్తూ ప్రజల దాహార్తిని తీర్చి ప్రజలకు మమేకమై పార్టీ ప్రజల సంరక్షణ కోసం అనునిత్యం ఆరాటపడుతూ ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెడుతూ ప్రజా క్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీకి మన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించా లని కోరారు.ఈ పథకాలే కాకుండా ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ నూతనంగా ప్రజా సంక్షేమం కోసం భారత రాష్ట్ర సమితి ఎన్నికల మ్యానిఫెస్టో – 2023
కుటుంబానికి ‘కేసీఆర్ బీమా’ 5 లక్షలు మరియు రైతుబంధు ఎకరానికి 16 వేల రూపాయలు వంటింటి ఆడపడుచులు కష్టాలు తీర్చడానికి 400 రూపాయలకే
వంటగ్యాస్ సిలిండర్
రేషన్ షాపులో సన్నబియ్యం
ఆసరా పెన్షన్లు పెంపు రూ.5016
దివ్యాంగులకు రూ. 6016 ల పెన్షన్
మహిళలకు నెలకు రూ. 3000 భృతి, ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలు
పేదలకు ఇండ్ల స్థలాలు
మైనార్టీ సంక్షేమాన్ని మరింత పెంపు పలు పథకాలు మేనిఫెస్టో ద్వారా ప్రజలకు అందించనున్నారు. పరకాల నియోజకవర్గ ప్రజలు పరకాల అభివృద్ధిపరిచిన చల్లా ధర్మారెడ్డి కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి హైట్రిక్ ఎమ్మెల్యేగా పరకాల శాసన సభ్యులుగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బండి సారంగపాణి,కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు,వీరేష్ రావు, విజయ్,వాసు,రమేష్ బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *