నేటి దాత్రి న్యూస్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితుడు నీరుడు ప్రసాద్ సీఎం కెసిఆర్ మీద పోటీకి సై అంటూ ఆర్ డీ ఓ కార్యక్రమంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా నీరుడి ప్రసాద్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో గజ్వేల్ ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి బ్లూ ఇండియా పార్టీ నుండి బి ఫాం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి మల్లన సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మల్లన్న సాగర్ నిర్మాణం ముందు ముంపు గ్రామాలవాసులను గుండెల్లో పెట్టుకుని చూస్తా అని చెప్పి మమ్మలని గజ్వేల్ లో ఒక మూలన చిన్న గృహాలను నిర్మించి ఇచ్చారని సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు నాకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, కమ్మేట బూపాల్,మధు,వెంకట స్వామి,జలంధర్ చారి, కర్ణాకర్, వేముల ఘట్ వాసులు తదితరులు పాల్గొన్నారు