తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి కేటీ రామారావునీ భారీ మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలతో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు అన్ని ప లాలు అందేలా చేశారని రైతుబంధు గాని రైతు బీమా గాని దళిత బందు గాని బీసీ బందు గాని కల్యాణ లక్ష్మి ఇలా ఎన్నో ప్రజలకు అవసరమయ్యే మంచి మంచికార్యక్రమాలు తీసుకువచ్చి ప్రజలలో స్థిరస్థాయిగా నిలిచిపోయారని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మళ్లీ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రచార కార్యక్రమంలో తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ పడిగల మానస రాజు స్థానిక సర్పంచ్ అనిత రవీందర్ ఎంపీటీసీ కోడి అంతయ్య పార్టీ అధ్యక్షులు రాజన్న పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి ఎ ఏం సి డైరెక్టర్ రోజా మైనార్టీ అధ్యక్షులు హమీద్ జాగృతి మండల అధ్యక్షుడు రామా గౌడ్ పార్టీ నాయకులు జగత్ అనిల్ వెంగళ రమేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు