లక్షెట్టిపేట మంచిర్యాల నేటిధాత్రి:
లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీ శివ సాయి గణేష్ సేవా సమితి వారు సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి గార్ల మనుమరాలు హనిక జన్మదిన సందర్భంగా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన ఏం బడి రాజయ్య రాజేశ్వరిల కుమార్తె సునీత వివాహానికి 15000 విలువ గల పుస్తెలు, మట్టెలు, బట్టలు సమితి తరపున అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమం అధ్యక్షుడు పాటిబండ్ల శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు ప్రసన్న, సుమతమ్మ, ప్రభాకర్, ప్రసాద్, విజయలక్ష్మి, ధనలక్ష్మి ,శ్రీనివాస్, లావణ్య, వైష్ణవి ,లక్ష్మి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు