అక్రమ మద్యం విక్రయిస్తున్న 184 మందిపై కేసు నమోదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

తెలంగాణ రాష్ట్ర) సాధారణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డిప్యుటి కమిషనర్ ఎక్సైజ్ కరీంనగర్, జిల్లా ఎక్సైజ్ అధికారి కరీంనగర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం, నాటుసారాయి అమ్మిన వారిపై దాడులు చేసి మొత్తం 184 కేసులు నమోదు చేసినట్లు జమ్మికుంట ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 190 లీటర్ల నాటుసారాయి, 28,444 లీటర్ల బెల్లం పానకం, 576 కిలోల బెల్లం, 278 లీటర్ల మద్యం బాటిళ్ళ సీసాలను స్వాదినం చేసుకొని 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయటం జరిగిందని చెప్పారు. మూడు మండలాలలో 130 మందిని అక్రమంగా మద్యం, నాటుసారాయి అమ్మకుండా ముందస్తుగా తహసిల్దార్ల వద్ద బైండోవర్ చేయటం జరిగిందన్నారు. అక్రమంగా మద్యం అమ్మినా, నిల్వ చేసినా, నాటుసారాయి, గంజాయి సరఫరా చేసినా, ఎన్నికల నిబంధనలలో భాగంగా వారిపై చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ ఎండి అక్బర్ హుస్సేన్ హెచ్చరించారు. అటువంటి సమాచారం ఉన్న యెడల టోల్ ఫ్రీ నంబర్లు 8019263862, 1800-425-2523 కి లేదా జమ్మికుంట ఎక్సైజ్ సీఐ నెంబరు 8712658812 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *