బిజెపి నుండి బీఆర్ఎస్ లోకి చేరిక
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోగడప గడపను తిరుగుతూ మహిళా మణులకు బొట్టుపెట్టి కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ ప్రభుత్వాన్ని మరోమారు విజయం కట్టబెట్టాలని అన్నారు. ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం ఆగకుండా నిరంతరం కొనసాగాలి అంటే కెసిఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని బీఅర్ఎస్ పార్టీకి ఘనవిజయం కట్ట పెట్టవలసిన బాధ్యత తెలంగాణ ప్రజానీకంపై ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలందరికి నెలకు రూ.3000లభృతి..రైతుబంధును రూ.16000లకు పెంచుతాం.గ్యాస్ సిలిండర్ నాలుగు వందలకే అందిస్తాము.ప్రతి ఇంటికి కేసీఆర్ బీమా కింద రూ.500000 ధీమా, సన్నబియ్యంపంపిణీ,ఆరోగ్య శ్రీని పదిహేను లక్షలకు పెంచుతాం.పని చేసే ప్రభుత్వాన్ని దీవించండి. మీతో ఉంటా మీ మధ్యలో ఉంటా అని అన్నారు.30వ తారీకు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డి భారీ మెజారిటీతోగెలిపించవలసినదిగా మనవి చేశారు.అనంతరం శాయంపేట టౌన్ బిజెపి ఉపాధ్యక్షులు బీజేవైఎం జిల్లా కార్యదర్శి బొడ్డు నాగరాజు, మరియు దుంపల శ్రీధర్ రెడ్డిలకు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి రెడ్డి, బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మండల ప్రజా ప్రతినిధులు , గ్రామాల ప్రజా ప్రతినిధులు, గండ్ర అభిమానులు, మహిళ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.