బోయిని పల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ముత్యాల విజయ్ కుమార్ బీఫామ్ అందుకున్నారు .ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ముత్యాల విజయ్ కుమార్ ను చొప్పదండి నియోజకవర్గం ప్రజలు ఆదరించి అపూర్వ మెజార్టీతో ఎమ్మెల్యేగా చేయాలని పిలుపునిచ్చారు .తనకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ అందజేసిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండా సురేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు తేజ్ దీప్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెద్దెల్లి శేఖర్, నాయకులు అంబటి అమిత్ రెడ్డి ,మాచర్ల అనిత, మాచర్ల సుమలత, దొంత నరేందర్, రాజు ,తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ అందుకున్న అభ్యర్థి ముత్యాల విజయ్ కుమార్ ;
