
వేములవాడలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బిగ్ షాక్
*కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు పడిగెల మహేష్ రెడ్డి
*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, చల్మెడ
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వేములవాడ పట్టణ 26వ వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సునంద-శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు పడిగేల మహేష్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు రాంపల్లి రాంబాబులు బుధవారం బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావుల సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరిన వీరికి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ నరసింహా రావులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు వేములవాడ పట్టణాన్ని దత్త త తీసుకొని అభివృద్ధి చేస్తానని యూత్ ఐకాన్, బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలను విశ్వసించి పార్టీలో చేరామని, రాబోయే రోజుల్లో చల్మెడ గెలుపు కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చల్మెడ మాట్లాడుతూ వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు పార్టీలో చేరడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, పార్టీ అభ్యున్నతి కొరకు కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం లభిస్తుందని హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ యువ నాయకుడు కేటీఆర్ పై నమ్మకంతో పార్టీలో చేరడం శుభ సూచకమని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి భవిష్యత్ లో తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుందని, నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి-రాజు, సెస్ డైరెక్టర్ నామాల ఉమ-లక్ష్మీ రాజాం, ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాదాడి గజానంద రావు, తీగల రవీందర్ గౌడ్, నరాల దేవేందర్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, గోలి మహేష్, యాచమనేని శ్రీనివాసరావు, జడల లక్ష్మీ-శ్రీనివాస్, నాయకులు గూడూరి మధు, గోపు బాలరాజ్, అక్రమ్, వాసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.