మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా
కారేపల్లి నేటి ధాత్రి.
సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి సభ కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రజాపంథా సంయుక్త మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం , సమ సమాజ స్థాపన లక్ష్యంతో ఎందరో వీరులు తమ అమూల్యమైన ప్రాణాలను మెరికల్లాంటి యువకులు వేలాది మంది త్యాగాలు చేశారని అన్నారు. గోదావరి లోయ పోరాట వారదులుగా ,సారదులుగా సరైన పందా కోసం జీవితాంతం శ్రమించిన కామ్రేడ్స్ రాయల సుభాష్ చంద్రబోస్, డివి కృష్ణ , పోట్ల రామ నరసయ్య, నీలం రామచంద్రయ్య, గడ్డంధ వెంకట్రామయ్య, బాటన్న ఎల్లన్న బికుమియా హనుమంతరావు గుగ్గిళ్ళ వెంకటేశ్వర్లు ధనుంజయ పగడాల వెంకన్న బోర్ర వీరస్వామి ముస్మీ అమరవీరులు ,మురళి గణేష్, లింగన్న బోగా శ్రీరాములు స్వర్ణపాక లక్ష్మీనర్స్ పాయం లక్ష్మీనారాయణ కాచనాపల్లి అమరవీరులు ముష్మి అమరవీరులు లాంటి ఎందరో యోధాను యోధులు త్యాగాలు చేశారని కొనియాడారు. నేడు మన దేశం పెట్టుబడిదారి దేశంగా మారిందని, రాజ్యం, కార్పొరేటీకరణ జంటగా నడుస్తున్నాయని ప్రజలను పాత పద్ధతుల్లో పాలకవర్గాలు పాలించలేకపోతున్నాయని థాయిలాలు ఒకపక్క గుమ్మిస్తూ, ప్రజా ఉద్యమాల మీద, ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితులలో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకపోవడానికి శబదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణపాక అనసూయ సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంథా సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు గుగులోతు తేజ, సక్రు భాస్కర్ లకుపతి రంగ్య పాపారావు కనకరాజు రామారావు తదితరులు పాల్గొన్నారు.