
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
ఈ నెల నాలుగవ తేదీన తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా ఆశీర్వాద సభలో జెఎసి చైర్మన్ గజ్జల కాంతం, గంగుల కమలాకర్ ని ఇట్టి మీటింగునకు ఆహ్వానించడానికి తన వద్దకు వెళ్ళిన క్రమంలో మంత్రి తెలంగాణలో ఉన్న తురక ముండ కొడుకులను ఎందుకు నీ వెంట ఏసుకు తిరుగుతున్నవు అని ముస్లిం మైనార్టీలను అవమానపరిచారని గజ్జల కాంతం మీటింగ్లో బహిరంగంగా చెప్పాడని,ఇందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలను ముండా కొడుకులుగా పేర్కొన్న విషయమై పూర్తి వీడియో ఆధారాలతో గజ్జల కాంతం, మంత్రి గంగుల కమలాకర్ లపై మంగళవారం జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ బిసి సంక్షేమ సమితి మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబీర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత ఫిర్యాదు విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తూ బాధ్యులపైన శాఖ పరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముస్లిం మైనారిటీలకు ఈ విషయంలో న్యాయం జరగనియెడల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయటంతో పాటు రాష్ట్ర హైకోర్టు లో కేసు నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సమితి మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబీర్ అలీ, తెలంగాణ మైనారిటీ ఫోరం సభ్యులు మొహమ్మద్ గయాస్ ఖాన్, తెలంగాణ బిసి సంక్షేమ సమితి హుజురాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్, న్యాయవాది కొత్తూరి రమేష్ పాల్గొన్నారు.