
డబ్బులకు అమ్ములు పోయే నాయకుడు కాదు
మాకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలి
సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్
జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండల్ కాన్కూర్ గ్రామం నుండి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ సభకు బయలుదేరిన గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు,యువ నాయకులు, మహిళలు, వృద్ధులు అలాగే ఇక్కడ బాల్క సుమన్ గెలుపు కోసం అక్కడ సీఎం కేసీఆర్ గెలుపు కోసం రాత్రి పగలు ఒక సైనికుల కష్టపడి పనిచేస్తామని, బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని మా ఎమ్మెల్యే చేసిన ఎన్నో అభివృద్ధి పనులు బిఆర్ఎస్ పార్టీకి గెలుపు దిశగా వెళుతుందని కాన్కూర్ గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర గౌడ్ తెలియజేశారు.