
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వారు మాట్లాడుతూ పుట్టిన నేలకు స్వార్ధకతం చేసుకున్న.
మహాభారతంలోనే ఉంది పాము పగ పాలిపగా.
లీడర్ పార్టీ మారినంత మాత్రాన క్యాడర్ మారదు ప్రజల అభిప్రాయం మారదు.
కట్టప్పలు ఎంతమంది వచ్చినా ప్రజా ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తా.
ఆరోపణలు చేయడమే పనిగా బ్రతికే నీకు నిరూపించే ధైర్యం ఉందా.నా అనుకున్న వాళ్ళందరూ కదన రంగంలో నన్ను మోసం చేసి వెళ్లడం చాలా బాధగా ఉంది.చెల్పూరు ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే గండ్ర దంపతులు.
నా తండ్రి గారి గ్రామంలో భారీగా మెజారిటీ ఇవ్వాలని చెల్పూర్ ప్రజలను కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి నేడు చెల్పూర్ గ్రామ సర్పంచ్ నడిపెళ్లి మధుసూదన్ రావు, ఎంపీటీసీ చెన్నూరు రమాదేవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న భూపాలపల్లి శాసన సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ,జయశంకర్ భూపాలపల్లి బి.ఆర్. ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రాష్ట్ర నాయకులు కేశవ్ రావు .అశేష చెల్పూర్ గ్రామ ప్రజల, కార్యకర్తల నడుమ సాగిన ప్రజా ఆశీర్వాద యాత్ర.ప్రతి మహిళ జై రమణన్న అంటూ, నుదుట వీర తిలకం పెడుతూ, మంగళహారతులతో స్వాగతం పలికారు.రాష్ట్రంలో కేసీఆర్ గారి సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారు.
భూపాలపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడిగా నాకు మరొసారి చెల్పూర్ గ్రామంలో అత్యధిక మెజారిటీ కల్పించాలి.
నా వెంట ఉండి నాతో అన్నివిధాలుగా అభివృద్ధి చెంది వెన్నుపోటు పొడిచి వెళ్లిన నాకు బాధలేదు.
వెళ్లిన కట్టప్పలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలి.నా తండ్రి గారికి జన్మానిచ్చిన చెల్పూర్ గ్రామాన్ని దాదాపు 7కోట్లతో అభివృద్ధి చేసిన.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దొంగ మాటలు,నాపై దుష్ప్రచారం చేసే నాయకులరా
మీకు దమ్ముంటే నిరూపించండి,లేకుంటే రాజకీయంగా పోరాటం చేయండి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మి నరసింహ రావు సొసైటీ చైర్మన్ కు రెడ్డి పూర్ణచందర్ రెడ్డి గణపురం మండల అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి ఎంపీటీసీ మోటాపోతుల శివశంకర్ గౌడ్ టౌన్ ప్రెసిడెంట్ గుర్రం తిరుపతి గౌడ్ మోటపోతుల చందర్ గౌడ్ గాజర్ల చింటూ గౌడ్ హఫీజ్ గ్రామ నాయకులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు