
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని గ్రామస్తుడైన జవ్వాజి ఆశయ్య జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ శ్రీలత విచారణ చేపట్టారు. ఇరువురి వాదనలు విన్న డిఎల్పిఓ విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపనున్నట్లు తెలిపారు. ఈవిచారణలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రేవంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.