
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన నేచర్ యూత్ క్లబ్ పాలకవర్గ సభ్యులు సుమారు వంది మంది కేసీఆర్ ప్రభుత్వం, సుంకె రవి శంకర్ చేస్తున్న అబివృద్దికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరగా చోప్పదండి నియోజకవర్గ అభ్యర్థి సుంకే రవిశంకర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈకార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నేరేళ్ళ అంజయ్య గౌడ్, కోండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు వెల్పుల హరిక్రిష్ణ, స్థానిక నాయకులు పూడూరి మల్లేశం, పైండ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.