
బారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ!!
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజకవర్గం
ఎండపల్లి మండలం అంబారీ పేట, గుల్లకోట, చర్లపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర లో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కి తిలకం బొట్టు పెట్టి మంగళ హారతి,కోలాటాలు, బతుకమ్మ లతో ఘన స్వాగతం పలికిన మహిళలు,ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయాలని వాళ్లకు ఎందుకు అనిపియ్యలేదో,! మనకు ఆశ్చర్యం అనిపిస్తది, అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు,చేయాలనేటువంటి నాయకులు ఉంటే ప్రభుత్వం ఉంటే మన కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఏదైనా సాధ్యమే,ఈ రాష్ట్రంలో చూపించినటువంటి నాయకుడు ప్రాజెక్టులు అయితే అనుకోలే, ప్రాజెక్టులు కావడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్క ఎకరా కూడా వృధా పోకుండా వ్యవసాయం జరిగే అటువంటి పరిస్థితి 9 సంవత్సరాలు వచ్చింది దీనికి కారణం తెలంగాణ రావడమే, తెలంగాణ అనేది రాకపోతే ఇవేవీ కూడా మనకు అందుబాటులోకి వచ్చేటివి కావు, మన అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది, ఏ విషయంలో చూసినా నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది,ఇదంతా కూడా మన గర్వ కారణం, కొన్ని విషయాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఇక్కడ ప్రజలు ఉంటారు, వారికి రకరకాల బాధలతో ఇబ్బందులతో ఉంటారు, పేదవాళ్లు ఉంటారు, అని గత ప్రభుత్వాలకు గుర్తు లేదా, పేదల బాగుకోసం కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన కూడా చేయలేదు,కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి పథకాలు చూసినట్టయితే ఒకే ఒక పథకం, పెద్దమనుషులకు పెన్షన్ ఇచ్చే పథకం అది తప్ప ఇంకేమైనా ఉన్నదా ఇంకా ఏమైనా ఉంటే దాని పేరు చెప్పండి ?అని మంత్రి అన్నారు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పథకాలు చెప్పుకుంటూ పోతే మనిషి పుట్టింది మొదలు మరణించే దాకా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి దేశంలో 30 కోట్ల మంది ఎస్సీ లు ఉన్నారు 60 ఏళ్లు పడి పడి కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేశాం కదా మరి కేంద్రంలో వాళ్లే రాష్ట్రంలో వాళ్లే ఉన్నారు నిజంగా చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఎందుకు ?నిజంగా ఒక ప్రభుత్వం అనుకుంటే ప్రజల తలరాతలు మార్చేటువంటి అధికారము ఉన్నది కానీ చేయలే, కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పిన ఈరోజు ఇన్ని ఏళ్లకు అయినా తరతరాలుగా వెనకబడ్డ జాతి ,అంటరాని వాళ్ళుగా ఉన్నటువంటి బీజం పడ్డది ఒక అడుగు పడ్డది అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్, తీసుకున్నటువంటి దళిత బంధు కార్యక్రమం, ఒక్క పైస కాదు రెండు పైసలు కాదు ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు చేసుకునేటువంటి వృత్తినే గొప్పగా అభివృద్ధి చేసుకొని బతకడం కోసం, ఇది తప్పు కాదు మార్చలేరు కానీ, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దళిత బంద్ వచ్చింది ఇవ్వడం జరిగింది అని తెలిపారుఈ సంవత్సరం కూడా రాష్ట్రమంతా 2 లక్షల 77 వేల మందికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదే విధంగా మా ధర్మపురి ఎస్సీ వర్గాల యొక్క అదృష్టం నిన్నగాక మొన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురికి వచ్చి 200 కుటుంబాలకు ఒక్కసారే దళిత బంధిస్తున్న అని చెప్పిన విషయంతో సంతోషం ,మీకంటే ఎక్కువ అనిపించింది అని తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి ,మండల యూత్ కో కన్వీనర్ గొల్లపెళ్లి రాజు,మండల అధ్యక్షులు సింహాచలం జగన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తి పాక వెంకటేష్, జిరెడ్డీ మహేందర్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచ్ లు, గ్రామ యూత్ అద్యక్షులు,బుర్ర సాయి కుమార్, పొన్నం మహేష్,మద్ది మహేష్ ,వివిధ సంఘాల యువకులు,నేతలు,తదితరులు ,మహిళా కోఆర్డినేటర్ లు,అభిమానులు పాల్గొన్నారు