
ఇంటింటికీ గులాబీ శ్రేణులు ప్రచారం
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి….
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం
చొప్పాల గ్రామ పంచాయతీలోని నర్సాపురం,గొడుగుబండ గ్రామంలో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రేగా కాంతారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.కేసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు,బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలను ప్రజలకు వివరించి,కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జవ్వాజి సమ్మయ్య,తోలెం సారయ్య,కొమరం సురేష్,ఉప సర్పంచు బోడ ప్రశాంత్,చప్పిడి వెంకటేశ్వర్లు,నిట్టా ఏడుకొండలు,మైత వసంతరావు,హరికృష్ణ,నర్సహారావు,శ్యామ్,నర్సయ్య,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.