
చెన్నూర్, నేటి ధాత్రి::
చెన్నూర్ నియోజకవర్గం, మందమర్రి పట్టణం లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు మందమర్రికి రానున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థి డా. బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూర్ పట్టణ బి అర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలు దేరారు.సభకు వెళ్లేందుకు అర్ టి సి బస్సుల ను ఏర్పాటు చేశారు. పులిహోర పాకెట్ లు వాటర్ పాకెట్స్ అందు బాటులో ఉంచారు.ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సాధన బోయిన కృష్ణ ,కోపుల రవీందర్ తుమ్మ.రమేష్ పార్టీ కార్యకర్తలు అభిమానులు సభను విజయవంతం చెయ్యటానికి పట్టణం నుండి వేలాదిగా తరలి వెళ్ళారు.