నెక్కొండ, నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని సెయింట్ థెరిస్ హై స్కూల్ నుండి 27వ, నేషన్ కరాటే ఛాంపియన్షిప్ 2023 కాంపిటీషన్స్ ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాన్ని థియేటర్ పక్కన నిర్వహించడం జరిగింది. ఈ కరాటే ఛాంపియన్షిప్ కాంపిటీషన్లో దాదాపుగా 2000 మంది పాల్గొన్నారు, అందులో సెయింట్ థెరిస్సా హై స్కూల్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. అందులో మొదటి బహుమతి గోల్డ్ మెడల్ సాధించిన బానోతు బన్నీ, 2వ స్థానంలో మాలో భరత్ కుమార్, (మహేష్ బాబు) రెండవ స్థానం సిల్వర్ మెడల్స్ లో భానోత్ రామ్ చరణ్ ,రెండవ స్థానం సిల్వర్ మెడల్స్ లో నస్పూరి సుహాన్, మూడవ స్థానంలో బానోతు హర్ష లు బహుమతులు పొందడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ , ప్రిన్సిపల్ చల్లా యాకుబ్ రెడ్డి- చల్లా మమతా రెడ్డి లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేసి హార్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం,దేవేందర్, ఎం ,రమేష్ ,ఎం శ్రీనివాస్, యు, శ్రీకాంత్,కే సుధాకర్ ,లావణ్య ,అనిత, రమ్య, పి ,ఈ ,టీ రఘు, కరాటే కోచ్ అండ్ మాస్టర్ కిరణ్ కుమార్ లు పాల్గొని విద్యార్థులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు.