ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై చేరికలు, కొప్పుల ఈశ్వర్
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,
వెల్గటూర్ మండలం తాళ్ళ కొత్తపేట గ్రామ బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు రంగు పున్నం గౌడ్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే గ్రామ దళిత వర్గం అందరం ఈశ్వరన్న కే మద్దతు ఇస్తామని అందరూ కలవడం జరిగింది . ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు ద్యావనపెల్లి ఎల్లయ్య , ఉపసర్పంచ్ మరియు గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ధర్మాజి సతీష్ , కోల చరణ్ గౌడ్ , కోటిలింగాల దేవాలయం పాలక మండలి మెంబర్ ఎల్కటూరి తిరుపతి , రవీందర్ , స్వామి , కుమార్ , శ్రీధర్ , మహిళలు పాల్గొన్నారు,