ఎంస్ ఫ్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పిస్ ఎం స్ ఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన ఎం స్ ఫ్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో విశ్వ రూప మహాసభ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.నవంబర్ 11నా జరిగే చలో హైదరాబాద్ కు ఎస్సీ రిజర్వేషన్ చట్ట బద్దత కల్పించాలని కోరుతూ మాదిగ ఉపకులాల విశ్వ రూప మహా సభ ఈ సభకు ముఖ్య అతిధి భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరు అవుతున్నారు కావున ఎస్సీ రిజర్వేషన్ చట్ట బద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నవంబర్ 11 న 2023 రోజున జరిగే హైద్రాబాద్ నగరం లోని పరేడ్ గ్రౌండ్ లో మాదిగ ఉపకులాల విశ్వ రూప మహా సభ ను విజయవంతం చేయండి ఈ కార్య క్రమంలో హన్మకొండ ఎమ్మార్పిస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ శాయంపేట మండల అధ్యక్షులు కొగిల సమ్మయ్య మాదిగ ఎం స్ ఫ్ రాష్ట్ర ప్రచారం కార్యదర్శి ముక్కెర ముకేష్ మాదిగ అరికిళ్ల దేవయ్య మాదిగ భద్రయ్య మాదిగ వెంకటేష్ మాదిగ మంద సదానందం మాదిగ పాల్గొన్నారు.