శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం, సాధనపల్లి, రాజుపల్లి, కాట్రపల్లి గ్రామాలలో భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు,కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు అంతేకాకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అందుకోసం అధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకి వివరిస్తూ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆయా గ్రామాల కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.