వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ చెక్ పోస్ట్ల వద్ద వాహనాల తనిఖీల సమయాల్లో పోలీసులు అప్రమత్తం వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. నర్సంపేట, ఖానాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మంగలవారిపేట బుధరావుపేట వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు వాహనాల తనిఖీల తీరును పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు.ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిన తీరు తెన్నులపై పోలీస్ కమిషనర్ చెక్ పోస్ట్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో నర్సంపేట ఏసీపీ తిరుమల్, దుగ్గొండి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ పుల్లాల కిషన్, ఖానాపూర్ ఎస్.ఐ మాధవ్ పాల్గొన్నారు.