జిల్లా ఎస్పీ హర్షవర్ధన్
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని,మహబూబ్ నగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్, ఐపీస్ పోలీసు సిబ్బందికి వులెన్ కోట్ లను అందించారు .
పోలీసు వృత్తి అత్యంత కష్టతరమైనదని, చలి, ఎండ, వానలను లెక్కచేయకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పగలు, రాత్రి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, కావున పోలీసు సిబ్బంది అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు.
పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా జిల్లా సిబ్బందికి చలి, రెయిన్‌కోట్‌లు (ఉన్ని జాకెట్లు) ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని ఎస్పీ అన్నారు.