ఓటు హక్కు వినియోగించుకోవడంలో యువత ముందు ఉండాలి

మరిపెడ నేటి ధాత్రి.

ఓటు హక్కు పొందటంలో చూపిస్తున్న ఆసక్తి ఉత్సాహాన్ని ఓటు వేయడంలో కూడా చూపించి యువత సత్తా చాటాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు, శనివారం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ స్వీప్ నోడల్ అధికారి ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య అవగాహన కార్యక్రమాల్లో భాగంగా వివిధ కళాశాల ల విద్యార్థులతో భారీ ఎత్తున ర్యాలీని జిల్లా ఎన్నికల అధికారి శశాంక పచ్చజెండా ఊపి ప్రారంభించారు.మరిపెడ మున్సిపల్ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం నుండి కార్గిల్ సెంటర్ వరకు భారీ ఎత్తున చేపట్టిన ర్యాలీలో అంగనవాడి ఉద్యోగులు ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు పాల్గొనగా ప్రజల్లో చైతన్యం పెరిగింది, ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ బావి భారత పౌరులని ఉజ్వల భవిష్యత్తు కు ప్రతీకలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని 100% ఓటు వేసి యువత సత్తా చాటాలని యువతి యువకులకు ఉద్బోదన చేశారు.ఎన్నికల ఆదేశాల మేరకు 1 శాతంగా ఉన్న యువత ఓటర్ నమోదును నాలుగు శాతం పెంచడం జరిగిందన్నారు, నవంబర్ 30వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నందున యువత ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వాయిదా వేసుకోవాలని నిరాశ నిర్లక్ష్యం నిర్లిత్తత విడనాడాలని దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందనేది మరిచిపోరాదన్నారు ఓటు వేయడం యువత బాధ్యతగా గుర్తించి తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వారవుతారన్నారు.ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా తోటి వారిని యువత అవగాహన పరచాలన్నారు ఓటరు జాబితా పై అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారన్నారు.ఎలక్షన్ లిట్రసి క్లబ్స్, చునావ్ పాఠశాల కార్యక్రమాల నిర్వహణ కాకుండా తెలంగాణ సాంస్కృతిక సారధులచే గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమాలు చేపట్టామన్నారు.భారత ఎన్నికల సంఘం 21 సంవత్సరం ఓటు హక్కు ఉన్న కాల పరిమితిని 18 సంవత్సరముల కు తగ్గించడం యువతకు చక్కని అవకాశం లభించిందన్నారు. ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం కనుల ముందు కనిపిస్తుందన్నారు అర్హులైన వారందరూ ఓటు హక్కు పొందటమే కాకుండా వినియోగించుకొని దేశ భవిష్యత్తును కాపాడాలన్నారు భావి భారత పౌరులుగా సత్తా చాటాలన్నారు.అనంతరం ర్యాలీలో పాల్గొని యువతకు ఉత్తేజాన్ని ఇచ్చారు. యువతీ యువకులు ఉద్యోగులు సిబ్బంది భారీ ఎత్తున పాల్గొని ఫ్లకాడ్స్తో ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తూ పట్టణ ప్రజలను ఆలోచింపజేశారు.అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పై రూపొందించిన ఫ్లెక్సీల ప్రచారాన్ని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ తో ప్రారంభింపజేశారు.ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని ఫోటోతో ప్రచారం చేశారు.ఈ ఎన్నికల స్వీప్ ప్రచార కార్యక్రమంలో డి.ఎస్.పి వెంకటేశ్వర బాబు,ఎంపీడీవో ధన్సింగ్,మున్సిపల్ కమిషనర్ రాజు,స్వీప్ నోడల్ అధికారి తాసిల్దార్ నరేష్, సిబ్బంది యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!