పరకాల లో ప్రచారం ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు
1వ వార్డులో ప్రచారం ప్రారంభించిన కౌన్సిలర్
పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల పట్టణంలోని ఒకటవ వార్డులో చల్లా ధర్మారెడ్డిని అధిక మెజారిటీ తో గెలిపించాలని ధర్మారెడ్డి గెలిస్తేనే పరకాల ఇంకా అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణకమిటీ ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభం
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శనివారం రోజున బి ఆర్ ఎస్ పట్టణ కమిటీ మడికొండ శ్రీను ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపు కోసం పట్టణం లోని పలు వార్డులల్లో ఇంటిటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
14వ వార్డులో ప్రచారం ప్రారంభం
హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లోని 14వ వార్డులో చల్లా ధర్మారెడ్డి గెలుపొందాలని ఇంటీంటికి ప్రచారాన్ని వార్డు కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.