పరకాల నేటిధాత్రి(టౌన్)
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిననాటి నుండి ముస్లిం మైనారిటీల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, వారంతా బిఆర్ఎస్ వెంటే ఉంటారని పరకాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ అన్నారు.గత పాలకులు ముస్లిం మైనారిటీలను ఓటర్లుగా మాత్రమే చూసే వారని, సిఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనారిటీల సంక్షేమనికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.
దేశం లో ఎక్కడ లేని విదంగా పేద ముస్లిం ఆడ బిడ్డల వివాహానికి షాది ముబారక్ పధకం ద్వారా రూ,1,00,116 అందిస్తున్నారని తెలిపారు.
మసీదు మౌజన్, ఇమామ్ లకు ప్రతి నెల రూ,5000 గౌరవ వేతనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు.
రంజాన్ మాసంలో నిరుపేద ముస్లింలకు బట్టలు మరియు రంజాన్ విందును ఏర్పాటు చేస్తుందన్నారు.
పేద ముస్లిం విద్యార్థులకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పైన ఒక లక్ష 25 వేలు ఖర్చు చేస్తుందని తెలిపారు.
చిరు వ్యాపారాలు చేసే పేద ముస్లిం కుటుంబాల కోసం 100%సబ్సిడీ తో ఒక లక్ష రూపాయల రుణం అందచేస్తున్నారని అలాగే పేద మహిళల కొరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు అందిస్తున్నారని అన్నారు.ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గ ముస్లిం మైనారిటీలు చల్లా ధర్మారెడ్డి కి తమ మద్దతూ తెలిపి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పరకాల ముస్లింలు చల్లా వెంటే-కో ఆప్షన్ సభ్యులు ముఫీనా హమీద్
