ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి
ధర్మపురి నియోజక వర్గంలో నిన్న జరిగిన బిఆర్ఎస్ పార్టీ సభలో ముఖ్య మంత్రి కేసీఅర్ పాల్గొని, మాట్లాడుతూ, మేము అధికారం లోకి రాగానే ,ధర్మపురి నియోజక వర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు వర్తింప జేస్తాం,అని చెప్పిన మాటలు,ఇటు బి అర్ ఎస్ కార్యకర్తల్ని, అటు దళిత కుటుంబాల ప్రజల్లో ,మళ్ళీ దళిత బందు పైన ,ఆశలు చిగురించాయి,అయితే ప్రతి కుటుంబానికి దళిత బందు ఇస్తాం అనడం పైన,ధర్మపురి నియోజక వర్గంలో,దళిత వర్గాలు,మరియు బీ ఆర్ ఎస్ మండల కమిటీ ఆధ్వర్యలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్య మంత్రి కేసీఅర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు, ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అద్యక్షులు, సింహాచలం జగన్, కన్వీనర్ మాదాసు సత్తయ్య, బిఆర్ఎస్ నేతలు చుంచు మల్లేశం, రామగిరి మల్లేశం,చొప్పదండి బుచ్చి లింగయ్య, సర్పంచ్ ,గంధం లక్ష్మీ నారాయణ తోపాటు వివిధ గ్రామాల సర్పంచ్ లు,మరియు నేతలు,గూడ రాంరెడ్డి, ఏలేటి కృష్ణారెడ్డి,జీరెడ్డి మహేందర్ రెడ్డి,తదితరులు, బిఅర్ఎస్ దళిత సోదర, సోదరీమణులు, పాల్గొన్నారు