శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం ప్రగతి సింగారం, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు అల్లె అర్జున్, ఎంసిపిఐ జిల్లా నాయకులు పింగళి రాజిరెడ్డి సుమారు 20 మంది కార్యకర్తలతో బిఆర్ఎస్ పార్టీకి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ప్రగతి సింగారం గ్రామ ట్రాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ పెంట రాజన్న, యూనియన్ నాయకులు పిట్టల రఘుపతి, మాదారపు సమ్మయ్య,మోరే రవి, పిట్టల సుధాకర్, మిరియాల తిరుపతి, బల్ల సతీష్, మూల గుండ్ల సందీప్ రెడ్డి, చిలుకల తిరుపతి, సతీష్,రవి,మాదం శ్రీకాంత్,తుమ్మల అనిల్, భూక్య అఖిల్, మరియు గాజే తిరుపతి ఎమ్మెల్యేను ప్రత్యక్షంగా కలిసి వారికి పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తూ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతోగెలిపించుకుంటామని తెలియజేయడం జరిగింది.. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత గండ్ర వెంకటరమణరెడ్డికే దక్కుతుందని, మరోమారు ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గండ్ర రమణన్న గెలిచి విజయ దుందుభి మోగిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ప్రగతి సింగారం గ్రామ సర్పంచ్ పోతు సుమలత రమణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు దూలం నాగరాజు, మండల పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మామిడి అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు.