జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
హుజురాబాద్ పట్టణానికి చెందిన మైనారిటీ నాయకులు జమ్మికుంట మండలం బిజిగిరిషరిఫ్ దర్గాలో కాంగ్రెస్ పార్టీ హజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ గెలువాలని దర్గాలోని సమాదుల వద్ద చాదర్లు సమర్పించి ఆయన గెలుపుకు అల్లా ఆశీస్సులు ఉండాలని ముస్లిం, మైనారిటీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అలీం, నవాబ్, తౌసిఫ్, రఫిక్, సల్మాన్, ఫర్మాన్, రియాజ్, రఫీ, అన్ను, సాదిక్, చాంద్, నవాబ్ పాషా, జియా, సలీం, ముఖిద్, హది తదితరులు పాల్గొన్నారు.