
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ,19వ ఎల్బీనగర్ రెడ్డి కాలని)వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి స్థానిక కౌన్సిలర్ శిరీష దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు
ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు అవకాశం కల్పిస్తే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరిచ్చిన అవకాశం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న, అభివృద్ధి చేసిన నెను మొదటి సారి ఎమ్మెల్యే గా గెలిచినపుడు చిన్న గ్రామం భూపాలపల్లి నేడు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేసుకున్నాం
వార్డుల్లో రోడ్ల సమస్య తీర్చినం, డ్రైనేజీ సమస్య తీర్చినం, నీళ్ల సమస్య తీర్చినం
పనులు చేసి ఓటు అడుగుతున్నా, అంతేగాని మాయమాటలు చెప్పి మిమ్మల్ని ఓటు అడగడం లేదు.
ఉమ్మడి జిల్లాలో ఉన్న 6 జిలాల్లో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో భూపాలపల్లి మొదటిస్థానం లో ఉంది ఎల్బీ నగర్, రెడ్డి కాలనీ వాసులకు నీళ్ల సమస్య ఉంటే వెంటనే వాటి పరిష్కారం చేసిన వార్డుల్లో ప్రచారానికి వస్తున్న ప్రతిపక్ష నాయకులు ఎం చేస్తారో చెప్పకుండా నన్ను తిట్టడమే ఒక పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు వారికి నా సవాల్ ఒక్కటే
పనిచేసి ఓటు అడుగుతున్న మీరు ఎం చేస్తారో చెప్పి ఓటు అడగండి.
లోకకళ్యాణార్థం భూపాలపల్లి పట్టణంలో గుడి నిర్మిస్తే దానిపై రాజకీయం చేస్తున్న నాయకులరా ఖబడ్దార్. నేను సవాల్ విసురుతున్న నేను గడిచిన 15 ఏళ్లలో ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్న నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా
నేను మొదటి నుంచే ధనిక కుటుంబంలో పుట్టిన నా వ్యాపారాలు అభివృద్ధి చెంది వచ్చిన డబ్బులను ప్రజల కోసం ఖర్చు చేస్తున్న కానీ ఎవరి దగ్గర లాక్కోలేదు జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ఎంతో మంది మధ్య, పేదతరగతి కుటుంబాలకు మా వంతు సహాయ సహకారాలు అందించిన.జిల్లాగా ఏర్పడిన భూపాలపల్లిలో అన్ని రకాల జిల్లా కార్యాలయాలు తీసుకుని వచ్చిన
పరిపాలన యంత్రాంగం మొత్తం మీ ముందు ఉంచిన
నాకు దొంగ ఏడుపులు రావు
సానుభూతికి తల వచింతే నెత్తిన ఎక్కి కూర్చుంటారు నాయకులు
చేసిన పనులపై వార్డుల్లో మహిళలు చర్చపెట్టాలి
భూపాలపల్లి నాలుగు దిక్కుల స్మశాన వాటికలు ఏర్పాటు చేసిన, నా సొంతంగా వాహనం కూడా అందించిన.ప్రభుత్వం అభివృద్ధి ఒక వైపు సంక్షేమ పథకాలు మరోవైపు కొనసాగిస్తున్నాం
భూపాలపల్లికె తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికుల యోగ క్షేమాల్లో పాలుపంచుకుంటున్నాం
మేన మామా లాగా కళ్యాణ లక్ష్మీ పథకం, పెద్దకొడుకు లాగా ఆసరా పెన్షన్,గురువుగా ఉచిత నాణ్యమైన విద్య, ఇంటికి పెద్దల పంట పెట్టుబడి సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు అమలుకు ఆమోదయోగ్యమైన పథకాలను మేనిఫెస్టో రూపంలో ప్రవేశ పెట్టిన మన నాయకుడు కేసీఆర్ ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి అధికారంలో ఉంచాలని సాగుతున్న అభివృద్ధిని కొనసాగించుకుందాం అని తెలిపారు.
ఒక్క ఓటు వేయండి 5ఏళ్ల సేవ చేసే భాగ్యం కల్పించండి.
ఈ సందర్భంగా 19వ వార్డుకు చెందిన పలువురు కీలక నేతలు వార్డు ఇంచార్జి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
చేరినవారిలో దూగ్యాల కిషన్ రావు, చెరుకు దినేష్, ఆలమాద్రి మహేష్,ఆకాష్, అలిమేల చిరంజీవి,కన్నం నితీష్, భోగం జయంత్, కత్తి యోగేష్, లకవత్ బాలు, చేతి సందీప్, ఇమ్రాన్,రాజ్ కుమార్, చెందు,సలీమ్,వినయ్,సూర్య చేరినారు ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమేష్ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి 19 వ వార్డు పార్టీ ఇన్చార్జి భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.