సీఐ మహేందర్ రెడ్డి
మందమర్రి, నేటధాత్రి:-
అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు, శాంతి భద్రతల రక్షణ గురించి గురువారం మందమర్రి పోలీస్ స్టేషన్ లో సీఐ మహేందర్ రెడ్డి పోలీసు పట్టణ సర్కిల్ కార్యాలయ అధికార సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా ముగించాలనే అంశంపై ఇప్పటి నుండే సిద్ధంగా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై చంద్రకుమార్, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై గంగారం, దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.