
-చిట్యాల ఏఎంసీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 1
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిని మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే..భూపాలపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవకాశం ఉంటుందని చిట్యాల ఏఎంసీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఉదయం 5:30 గంటల నుండి ఆయన తన బృందంతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించాచి, గ్రామంలోని ప్రతి గడప గడపను తట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ..కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకట రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత ప్రచారాలను నమ్మి..ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లడే సమ్మక్క మహిపాల్, సీనియర్ నాయకులు లడే మహేందర్, దార్ల ఆనంద్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కుమ్మరి సమ్మయ్య, ఉప సర్పంచ్ పోషాలు, నాయకులు గడ్డం సమ్మయ్య, పోతురాజు సమ్మయ్య, పసుల తిరుపతి, పసరగొండ స్వామి, లక్ష్మణ్ టిఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.