వేములవాడ రూరల్ మండలంలో బీజేపీకి బిగ్ షాక్

*బీజేపీని వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన ఎదురుగట్ల యువకులు

*కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జడ్పీ చైర్మన్ అరుణ, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ

వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన బిజెపి ఎస్సీ మోర్చా రూరల్ మండల అధ్యక్షుడు లక్కే కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ లింగంపల్లి శంకరయ్య, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు లింగంపల్లి హనుమంతు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఎడపల్లి రాజయ్యలతో పాటు సుమారు 40 మంది యువకులు బుధవారం బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల రవి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి జెడ్పి చైర్మన్ అరుణ- రాఘవరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావులు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే బి.ఆర్.ఎస్ పార్టీలో చేరుతున్నామని, రాబోయే రోజుల్లో చల్మెడ గెలుపు కొరకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ అరుణ మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసిన తర్వాత ఎవరైనా బి.ఆర్.ఎస్ పార్టీలోకి రాక తప్పదని అన్నారు. తదనంతరం చల్మెడ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరడం శుభ సూచకమని, పార్టీలో నూతనంగా చేరిన యువకులు రాబోయే రోజుల్లో బి.ఆర్.ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు ఏష తిరుపతి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, నాయకులు రోమాల ప్రవీణ్, మల్లారం తిరుపతి, చంద్రగిరి అంజయ్య, బండారి శ్రీనివాస్ గౌడ్, ఎడపల్లి విష్ణు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!